శ్రీ మద్ రామాయణం భార తీయుల ఆది కావ్యం గా చెప్ప బడుతోంది.రామాయణ ప్రారంభం - నారద మునిని ఒక ఆదర్శ వంతమైన మనిషి లేదా మానవుని గురించి వాల్మీకి ప్రశ్నించడం తో ప్రారంభమవుతుంది. వాల్మీకి మహర్షి — 16 గుణములు చెప్పి — ఆ గుణ విశేషాలతో ఉండే మనిషి గురించి చెప్పమంటాడు. అందులో ఒకటి- ” కృతజ్ఞ్యవాన్”మనిషి అనిపించుకోవడానికి కావలసిన అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి - కృతజ్ఞ్యత.నిత్యం మనం ఎందరినుంచో … ఎన్నో రకాలుగా సహాయాన్ని పొందు తున్నాము. అత్యవసరంలో అప్పు ఇచ్చిన వాళ్లు, మన ఇంటి ఆడపడుచుకి మంచి పెళ్లి సంభంధం చూపించిన వాళ్లు, ఉద్యోగంలో సహాయం చేసిన వాళ్లు, మంచి సలహా చెప్పిన వాళ్లు … ఇలా ఎందఱో .. ఎన్నో సమయాల్లో.కాలం మనిషిలో ఎన్నో మార్పులు తీసుకు వస్తుంది. మనకు సహాయం చేసిన వారు , ఈ రోజు మనతో పూర్వం అంత సఖ్యంగా ఉండక పోవచుచు … వాళ్ళకి మనకి ఏదో ఒక గొడవ రావచ్చు. ఏదైనా కాని … గతాన్ని మరచి వాళ్ళని ద్వేషించడం “కృతఘ్నత” అనిపించ కుంటుంది.మనకు సహాయం చేసినివారిని ఈ జన్మంతా గుర్తుంచుకోవడం మనిషి అనిపించుకోవడానికి కావలసిన ప్రాధమిక లక్షణంగా మన ఆదికవి వాల్మీకి ఆనాడే చెప్పాడు.Thanks చెప్పడమో, Gift ఇచ్చి అక్కడకి సరిపోయిందని అనుకోవడమో కూడదన్నారు. నీ శక్తి కొలది, అవసర్రాన్ని బట్టి ప్రత్యుపకారం చెయ్యవచ్చు. కాని అక్కడితో account సరి పోదు.అవసరం మనిషిని ఎక్కడికైనా తీసుకు వెళ్తుంది, ఎంత పని అయినా చేయిస్తుంది. కాబట్టి అవసరంలో ఆదుకున్న వారి సహాయాన్ని, ఆ తర్వాతి కాలంలో డబ్బుతో వెల గట్టడం అతి హేయమైన పని.ఆ సహాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కృతజ్ఞ్యత మనిషి ప్రాథమిక లక్షణం.
రామాయణ ప్రారంభంలోనే ఆది కవి — ఆదికావ్యమ్లో — ఆదిగా చెప్పిన మాట — కృతజ్ఞ్యత — Thankfulness.
16, ఫిబ్రవరి 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి