ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి,
అన్యుల మనముల్ నొప్పించక, తా నొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
Say No, when You want to say No… ఉన్న విషయాని స్పష్టంగా చెప్పడం, మనకు కావలసిన దానిని మొహమాటంతో చే జార్చుకోక పోవడం … ఈ కాలంలో బ్రతకడానికి కావలసి లక్షణంగా — ఎందఱో వ్యక్తిత్వ వికాస పుస్తక రచయతలు చెప్పారు.
కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వాళ్లు మనకి కొత్త కాదు. అయితే దాని వల్ల — ఉన్న “కుండ” కూడా పోవడం తప్ప ఒరిగేదేమీ లేదు. అసత్యాలు చెప్పాకా — ఆ బంధాన్ని ఎల్ల కాలమూ కోన సాగించ లేము. నిజం బయట పడక పోదు. విషయం చెప్పడం ఎంత ముఖ్యమో , ఎదుటి వాడిని భాద పెట్ట కుండా, మనసుని నొప్పించకుండా మాట్లాడం, అంటే ముఖ్యం. సమయ స్ఫూర్తితో తాత్కాలిక ఇబ్భందుల నుంచి తప్పించికోమంటాడు శతక కర్త. అవును మరి, మీరేమి చెప్పారన్నది ఎంత ముఖ్యమో — ఎలా చెప్పారన్నది అంతకన్నా ముఖ్యం ఈ రోజుల్లో. చిక్కని అనుభందానికి, చక్కని సాన్నిహిత్యానికి మనసుని నొప్పించని మాట చాల ముఖ్యం. మాటే మంత్రము...!
16, ఫిబ్రవరి 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి