16, ఫిబ్రవరి 2009, సోమవారం
తొలకరి ...
హాయ్ , హల్లో, .. గుడ్ ఈవెనింగ్ -- చూసారా నేనూ తెలుగు వాడినేనని గుర్తు పట్టేశారు. అవును మరి- ఖచ్చితం గ ఇంగ్లీషులోనే పలకరించేది తెలుగు వాళ్ళేనని లోకవిదితం. ఐనా ఈ మధ్య 'నమస్కారము' అంటే మరీ పల్లెటూరి వాడిని చూసినట్టు చ్చూస్తున్నారు. ఈ మధ్యనే ఓ మంచి మిత్రుడు ఇంటర్నెట్లో ఉన్న తెలుగుని చూపించాడు. కూడలి, లేఖిని లని పరిచయం చేసాడు. ఇంకా బ్రతికున్న తెలుగుని, ఎక్కడ ఉన్నా తెలుగుని మరచిపోని నా తెలుగు వాళ్ళని చూసి చాల చాల సంతోషపడ్డాను. హ్రుదయాంతారాళలొ నిద్రాణమైన నా తెలుగు ఆలోచనలు - భావాలు - మేల్కుంటున్నాయి. మనసు భావాలూ గొంతు దాటి రావాలని ప్రయత్నిస్తున్నాయి. మీ అందరితో నా ఆలోచనలు పంచుకోవాలనే కోరికకి ...కొన్ని ప్రయోగాల అనంతరం ఇలా బ్లాగ్ రూపం వచ్చింది. నన్నూ మీలో ఒకడిగా చేర్చుకోరూ -- మీ కొత్త నెజ్జనుడు -- తెలుగు కొంగ్రొత్త బ్లాగరుడు -- ధన్వంతరి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి