విజ్ఞాన శాస్త్రంలో మంచి జ్ఞానం కలిగి ఉన్నా ఒక అధ్యాపకుడు తన తరగతిలోని పిల్లలతో ... ఆధునిక విజ్ఞ్యానానికి, శాస్త్రవేత్తల దృష్టిలో భగవంతుడి ఉనికి గురించి మాట్లాడుతూ ... కొత్తగా చేరిన ఒక పిల్ల వాడితో జరిపిన సంభాషణ ... అధ్యా- అయితే నువ్వు దేవుడున్నాడని నమ్ముతున్నావా ?
విద్యార్థి- ఖచ్చితంగానండి
అధ్యా- దేవుడు మంచి వాడేనా?
విద్యార్థి- తప్పకుండా
అధ్యా- దేవుడు సర్వ శక్తి వంతుడా?
విద్యార్థి- అవును
అధ్యా- నా తమ్ముడు కాన్సర్ తో మరణించాడు. తనని కాపాడమని, బ్రతికించమని దేవుడిని ఎంతగానో ప్రార్థించాడు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మనమందరం సహాయం చేస్తాము. కాని దేవుడు చెయ్యడు. ఎ విధంగా దేవుడు మంచి వాడు?
విద్యార్థి- మౌనంగా ఉన్నాడు ...
అధ్యా- నువ్వు సమాధానం చెప్పలేవు .. చెప్పగలవా? సరే మళ్ళి మొదటి నుంచి ప్రారంభిద్దాము. దేవుడు మంచి వాడా?
విద్యార్థి- మంచివాడే
అధ్యా- మరి సైతానో?
విద్యార్థి- చెడ్డవాడు
అధ్యా- మరి ఈ సైతాను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పగలవా?
విద్యార్థి- ఉమ్..... దేవుడి నుంచి ...
అధ్యా- : మంచిది. సరే ఈ విషయం చెప్పు ... ప్రపంచంలో చెడు అంటూ ఉందా?
విద్యార్థి- ఉంది అధ్యా- ప్రపంచం అంతటా చూడు అన్నది ఉంది. ఈ ప్రపంచంలోని అంతటినీ దేవుడే సృష్టంచాడు కదా ? విద్యార్థి- అవును.
అధ్యా- అయితే ఈ చెడుని ఎవరు సృష్టించారు?
విద్యార్థి- ( సమాధానం చెప్పలేదు .. )
అధ్యా- దరిద్రము, దుర్మార్గత్వము, జుగుప్స ... ఎలా ఎన్నో భయమ్కరమైన విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవునా?
విద్యార్థి- అవునండి
అధ్యా- వాటిని ఎవరు సృష్టించాడు ?
విద్యార్థి-(స మాధానం లేదు).
అధ్యా- ఇదు జ్ఞానేంద్రియాల ద్వారా ఈ సృష్టిలోని ప్రతీ విషయాన్ని తెలుసుకో వచ్చు ... అనుభవించోచ్చు. నువ్వు ఎప్పుడైనా దేవుడిని చూసావా?
విద్యార్థి- లేదండి
అధ్యా- ఊఁ .. నువ్వు ఎప్పుడైనా దేవుడిని " విన్నావా?"
విద్యార్థి- లేదండి
అధ్యా- సరే.. నువ్వు ఎప్పుడైనా దేవుడిని చూసావా ... స్ప్రుసించావా... వాసన చూసావా ... అసలు దేవుడిని గురించి జ్ఞ్యనేంద్రియ సంభందిత అనుభవం ఏదైనా ఉందా?
విద్యార్థి- లేదండి ... లేదనే అనుకుంటున్నాను.
అధ్యా- ఐనప్పటికీ నువ్వు దేవుడున్నాడని నమ్ముతున్నావు. అవునా..?
విద్యార్థి- అవును
అధ్యా- సైద్ధాంతిక, విస్లేష్ణాత్మిక, ప్రయోగాత్మిక నియమాల ప్రకారము, " దేవుడు" లేదని విగ్న్యాన శాస్త్రం అంటుంది. నువ్వేమంటావు?
విద్యార్థి- నేనేమి అనను. నా నమ్మకాలు నాకున్నాయి.
అధ్యా- " నమ్మకం " . నేడు విగ్న్యాన శాస్త్రం ముందున్న అతి పెద్ద సమస్య .. ఈ నమ్మకాలే
అప్పుడు విద్యార్థి ఇలా అన్నాడు... సరే .. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగ వచ్చా?
విద్యార్థి- "వేడి" అంటూ ఏదైనా ఉన్నదా?
అధ్యా- ఉంది
విద్యార్థి- మరి "చల్లదనము" ఉందా?
అధ్యా- ఉంది.
విద్యార్థి- లేదు .. మీరు చెప్పింది తప్పు..
(చర్చ ఈ రకమైన మలుపు తిరగగానే తరగతి గది నిండా నిశ్సభ్ధం ఆవహించింది )
విద్యార్థి- : గురువు గారు మీరు మళ్లి తప్పు చెప్పారు. చీకటి అన్నది వెలుతురు లేకపోవడమనే స్థితిని సూచిస్తుంది. మనకి కొంచెం వెలుతురు, వెలుతురు, బాగా వెలుతురు, కళ్లు జిగేల్ మనే వెలుతురు ... అంటు స్థాయీ భేదాలు ఉన్నాయి. చీకటి అంటూ ఒకటి ఉంటే , మీరు దాన్ని మరింత గాడమైన దాన్నిగా మారచ గలిగే వారు. కొంచెం చీకటి అంటే ఇంకా కొంచెం వెలుతురు ఉందని అర్థం. వెలుతురు పూర్తిగా లేకపోతె అక్కడ ఏమీ ఉండదు. ఆ స్థితినే చీకటి అంటారు.
అధ్యా- అయితే, ఇంతకూ నీవు చెప్పదలచుకున్నదేమిటి?
విద్యార్థి- : గురువు గారూ, నే చెప్పేదేమిటంటే...మీ సిద్ధాంతాలనీ తప్పుల తడకని.
అధ్యా- తప్పుల తడాకా ... నీవు వివరించగాలవా ఎలాగో?
విద్యార్థి- గురువుగారూ.. మీరు రెండు విరుద్ధమైన విషయాలను ఒకేసారి ఉన్నాయని అంటున్నారు. జీవితం ఉందంటారు, దానితోపాటే మరణమూ ఉందంటారు. మంచి దేవుడు చెడ్డ దేవుడు అంటూ రెండు రకాలుగా చేస్తున్నారు. దేవుడనే విషయాన్ని భౌతిక సిద్దాంతల కొలతలకి లొంగే ఒక ఆదార్ధం గానో లేదా ఒక స్థితి గానే చూస్తున్నారు. గురువుగారూ ఈ రోజుకీ కుడా " ఆలోచన" అంటే ఏమిటో విగ్న్యాన శాస్త్రం వివరించ లేకపోయింది. శాస్త్ర వేత్తలు విద్యుత్తుని, అయస్కాంతం యొక్క ఆకర్షణ/వికర్షణ శక్తిని వాడుతున్నారు. కాని వారిలో ఎ ఒక్కరు కూడా ఇయస్కాంత శక్తిని కాని విద్యుత్తుని కాని కంటితో చూసిన వారు కాదు. నిజం చెప్పాలంటే ఈ రోజుకీ ఆ రెంటి గురించి మనకి తెలిసింది చాల తక్కువ. చావు అన్నది ప్రాణానికి వ్యతిరేకపడం కాదు. చావు విడిగా ఒక పదార్థం గానో ఒక స్థితి గానో మనగాలిగేది కాదు. చావు అన్నదీ జీవించదాని వ్యతిరేకమైన స్థితి కాడు అది జీవ లక్షణం లేని స్థితిని మాత్రమె తెలుపు తుంది. ప్రాణం పోయాక ఉన్నా స్థితిని మరణం అంటారు.
సరే, గురువు గారు నాకీ విషయం చెప్పండి. మీరు మీ విద్యార్థులకి వారు కోతి నుండే జీవ పరిణామ క్రమంలో వచ్చారని భోధిస్తూ ఉంటారా?
అధ్యా- ఓహ్.. జీవశాస్త్రానికి చెందినా ప్రాకృతిక పరిణామక్రమ గురించా ...నేను అలానే భోదిస్తూ ఉంటాను.
విద్యార్థి- : ఆ పరిణామక్రమాన్ని మీరు ఎప్పుడైనా మీ కళ్ళతో చూసారా గురువుగారూ?
(సంవాదం ఎక్కడికి దారితీస్తోందో గమనించిన అధ్యాపకుడు చిరునవ్వుతో అడ్డంగా తల ఊపేడు )
విద్యార్థి- : ఎ ఒక్కరూ కూడా జీవ పరిణామ క్రమాన్ని చ్చూడ లేదు ... చూసే వీలులేదు. ఈ పరిణామక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంటుందని చెప్పడానికి ఆధారమూ లేదు. అలా అయితే మీరు మీ అభిప్రాయాన్ని మాత్రమె మా మీద రుద్దుతున్నారు తప్ప .. ప్రయోగశాలలో రుజువైన వైజ్ఞానికమైన విషయాలని భోదించడం లేదన్నమాట.
(తరగతి గదిలో గుసగుసలు మొదలయ్యాయి )
విద్యార్థి- : ఈ తరగతి గదిలో ఉన్నవాళ్ళలో ఎ ఒక్కరైనా మన గురువుగారి తెలివితేటల్ని చూసారా? (తరగతి లోని విధ్యార్దులందరూ నవ్వడం మొదలు పెట్టారు ) విద్యార్థి- ఇక్కడ ఉన్నా మీ అందరిలో ఎ ఒక్కడూ కూడా గురువుగారి తెలివితేటలని , మేధస్సుని చూడ లేదు, స్ప్రుసించ లేదు, వినలేదు, అనుభవించలేదు.సైద్ధాంతిక, విశ్లేషనాత్మిక , ప్రయోగాత్మిక నియమాల ప్రకారము, గురువు గారికి తెలివి లేదని విజ్ఞ్యాన శాస్త్రం అంటుంది. మీ మీద ఎంతో గౌరవమ్తో .... ఒక తెలివితక్కువ వాడి పాఠాల్ని ఎలా వినమంటారో చెప్పమని అడుగుతున్నాను.
(తరగతి గది అంటా నిశ్శభ్ధం.. విద్యార్థి వంకే తేరిపార చూస్తున్నారు ఆచార్యులవారు ... ఆ ముఖం లోని భావాలు ఓ పట్టాన అంతు పట్టడం లేదు )
అధ్యా- ప్రతీ దాన్ని ప్రయోగ శాలలో చూపించడం కుదరదు బాబూ... కొన్నింటిని నమ్మాలి అంతే
విద్యార్థి- అవును గురువుగారూ.. నమ్మకమే... మనిషికి భగవంతుడికి అనుసంధానమైనది. ఆ నమ్మకమే జీవితాలని ఈ ప్రపంచాన్ని ముందుకి నడిపిస్తోంది.
ఇంతకూ ఆ విద్యార్థి ఎవరో తెలుసు కోవాలని అనుకుంటున్నారా?
ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన.
ఆ విద్యార్థి ఎవరో కాదు...
మన ఎ.పి.జే. అబ్దుల్ కలాం..
16, ఫిబ్రవరి 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి